Thursday, 13 August 2026
  • Home  
  • ఎస్‌ఐఆర్ ఓటరు జాబితాపై అధికారులతో సమీక్ష
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్‌ఐఆర్ ఓటరు జాబితాపై అధికారులతో సమీక్ష

నెల్లూరు నగర నియోజకవర్గం-117 ఈఆర్‌ఓ వై.ఓ. నందన్ బుధవారం నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏఈఆర్‌ఓలు, సూపర్వైజర్లు, బీఎల్‌ఓలతో ఎస్‌ఐఆర్ ఎలెక్టోరల్ రోల్స్-2026పై సమీక్ష నిర్వహించారు. రెండో దశ ఓటరు జాబితా రూపకల్పనలో మొబైల్ యాప్ వినియోగంపై పవర్‌పాయింట్ ద్వారా వివరించారు. సెప్టెంబర్ 28 వరకు మొదటి జాబితాలో పేరు లేని వారికి నోటీసులు అందించి, ప్రభుత్వం నిర్దేశించిన ధృవీకరణ పత్రాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. 1987కు ముందు జన్మించిన వారు స్వంత ధృవీకరణ పత్రం, 1987–2004 మధ్య జన్మించిన వారు తల్లిదండ్రుల్లో ఒకరి ధృవీకరణ, 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులిద్దరి ధృవీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రఘునాథరావు, శ్రీలక్ష్మి, వాసుబాబు, వెంకటలక్ష్మి కస్తూరి, వేణు, తిరుపాలు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.