తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూలై 29: తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామంలో రైతులకు “ఎల్‌నినో ప్రభావం–ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి యాజమాన్యం, పంటల బీమా” అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొవ్వూరు ఆర్డీఓ కే. ఆనందరావు మాట్లాడుతూ వరికి ఎకరానికి ₹570, మినుములకు ₹300, అరటికి ₹3,000 ప్రీమియం చెల్లించి పంటల బీమా పొందాలని సూచించారు. వరి బీమా ప్రీమియం చెల్లింపునకు ఆగస్టు 15, 2026, మినుము, అరటి పంటలకు జూలై 31, 2026 చివరి తేదీలని తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ లావణ్య తక్కువ నీటి అవసరమున్న అపరాలు, చిరుధాన్యాల సాగుపై రైతులకు సూచనలు చేశారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన – పంటల బీమాపై ఆర్డీఓ సూచనలు