2021 డిసెంబర్‌లో జరిగిన శాసనమండలి ఎన్నికల సమయంలో నమోదైన కేసులో భాగంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని నిరసించినందుకే తనతో పాటు ఇతర నాయకులపై కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావుతో పాటు మిక్కిలినేని నరేంద్ర, నరసింహారావు, జెర్రిపోతుల అంజనీ, బచ్చలకూరి నాగరాజు తదితరులు ఉన్నారు.



