Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోండి

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్‌ 26 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ సూచించారు.
  • ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌, రెవెన్యూ, ఉపాధ్యాయులు, ఇతర శాఖల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో ఆత్మకూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
  • ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలను నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు వేసే అవకాశం

ఆత్మకూరు, అక్టోబర్‌ 26 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌, రెవెన్యూ, ఉపాధ్యాయులు, ఇతర శాఖల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో ఆత్మకూరు పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలను నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. మొత్తం 28 వార్డులకు 30 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి నలుగురు, కౌన్సిలర్‌ స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు.పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం మున్సిపల్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్‌ గంగాప్రసాద్‌ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *