దుత్తలూరు ఎంపీడీవో మల్లిఖార్జునను పున్నమి తెలుగు దినపత్రిక ఉదయగిరి ఇంఛార్జి, రిపోర్టర్ నేలటూరి ధనుంజయ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, స్థానిక సమస్యలపై ఇరువురూ స్నేహపూర్వకంగా చర్చించారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలను వెలుగులోకి తీసుకురావాలని, అధికార యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని చర్చించారు. ఈ మర్యాదపూర్వక భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది. అనంతరం రిపోర్టర్ ధనుంజయ ఎంపీడీవో మల్లిఖార్జునకు ధన్యవాదాలు తెలిపారు.

ఎంపీడీవో మల్లిఖార్జునను మర్యాదపూర్వకంగా కలిసిన పున్నమి రిపోర్టర్ ధనుంజయ