పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 10: రాబోయే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణపై వేముల మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీటీసీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 11న ప్రచురించనున్నట్లు అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు.
సమావేశంలో మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.




