నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు (వల్లభ్ నగర్)కు చెందిన ఎండి యాకూబ్ పాషా గారి కోడలు, ఎండి పాషా గారి సతీమణి ఎండి అమీనా గారు ఇటీవల మరణించారు. బుధవారం నాటి ఆమె దశదిన కర్మ సందర్భంగా స్థానిక మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతురాలి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అమీనా గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, శోకార్తులైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా 4వ వార్డ్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బాధితులకు 50 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచినీళ్ల నాగరాజు, ముఖ్య సలహాదారు ముత్యాల సాంబయ్య, ఉపాధ్యక్షులు ఎదరబోయిన రాజేందర్, ఇస్లావత్ వీరన్నలతో పాటు యూత్ నాయకులు అంగోతు శివ కుమార్, ఎండి సద్దాం హుస్సేన్, ముత్యాల రేవంత్, దూదిమెట్ల దిలీప్, ఎండి ఆదిల్, ఈసంపల్లి స్వామి, ఈసంపల్లి కట్టయ్య తదితరులు పాల్గొన్నారు

ఎండి అమీనా గారి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ: 50 కేజీల బియ్యం అందజేత
నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు (వల్లభ్ నగర్)కు చెందిన ఎండి యాకూబ్ పాషా గారి కోడలు, ఎండి పాషా గారి సతీమణి ఎండి అమీనా గారు ఇటీవల మరణించారు. బుధవారం నాటి ఆమె దశదిన కర్మ సందర్భంగా స్థానిక మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతురాలి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమీనా గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, శోకార్తులైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా 4వ వార్డ్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బాధితులకు 50 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచినీళ్ల నాగరాజు, ముఖ్య సలహాదారు ముత్యాల సాంబయ్య, ఉపాధ్యక్షులు ఎదరబోయిన రాజేందర్, ఇస్లావత్ వీరన్నలతో పాటు యూత్ నాయకులు అంగోతు శివ కుమార్, ఎండి సద్దాం హుస్సేన్, ముత్యాల రేవంత్, దూదిమెట్ల దిలీప్, ఎండి ఆదిల్, ఈసంపల్లి స్వామి, ఈసంపల్లి కట్టయ్య తదితరులు పాల్గొన్నారు

