Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఊటుకూరు లో ఈదురు గాలుల బీభత్సం.. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఊటుకూరు లో ఈదురు గాలుల బీభత్సం.. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు!

వార్త ముఖ్యాంశాలు

  • -నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
  • నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షాలకు తోడు వీచిన బలమైన ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.
  • గాలుల తీవ్రతకు గ్రామంలోని పలుచోట్ల చెట్లు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు సైతం విరిగి పడిపోయాయి.

-నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం కురిసిన భారీ వర్షాలకు తోడు వీచిన బలమైన ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. గాలుల తీవ్రతకు గ్రామంలోని పలుచోట్ల చెట్లు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు సైతం విరిగి పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రహదారులపై చెట్లు పడినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కూలిపోయిన చెట్లను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగలు తెగిపడి కనిపిస్తే వాటి వద్దకు వెళ్లకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *