ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భగాయత్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీమాజ్జో కాఫీ షాప్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాఫీ షాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీమాజ్జో కాఫీ షాప్ యజమానులు సురేష్, కల్యాణిలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభించిన సంస్థ విజయవంతంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూజల వేదవతి, పూజల పవన్, మోహన్, తుమ్మల దేవిరెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొని క్రీమాజ్జో కాఫీ షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.



