నర్సంపేట ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) గౌరవ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ నియామకమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో NMU నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆయనను గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు సాంబయ్య గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్టీసీ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో NMU నాయకులు పి.ఎన్. రావు, బి. సాంబయ్య, ఆకుల స్వామి, ఎండి. రఫీ, జిల్లెల సంపత్, జికే స్వామి, గడ్డం శ్రీలత, తాటికొండ యాదయ్య, రూపిక సుమన్, ఎస్. రవీంద్రాచారి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

నర్సంపేట ఆర్టీసీ NMU గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్ నియామకం
నర్సంపేట ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) గౌరవ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ నియామకమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో NMU నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆయనను గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు సాంబయ్య గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్టీసీ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NMU నాయకులు పి.ఎన్. రావు, బి. సాంబయ్య, ఆకుల స్వామి, ఎండి. రఫీ, జిల్లెల సంపత్, జికే స్వామి, గడ్డం శ్రీలత, తాటికొండ యాదయ్య, రూపిక సుమన్, ఎస్. రవీంద్రాచారి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

