ఉప్పల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.
ఉప్పల్ భగాయత్ లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
*ఉప్పల్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..*
ఆడబిడ్డలు వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశ్వీరధించారు..
ఆడబిడ్డలకు నా ప్రతి సభలో ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలి..
మహిళలు ఆశీస్సులతోనే జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను..
కొడంగల్ లో నేను ఓటమి చెంది రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలిన సందర్భంలో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా నిలబడ్డాను..
ఐదేళ్లు తిరిగినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పూర్తి కాదు..
మల్కాజ్ గిరి పార్లమెంట్ అంటే మినీ భారత దేశం..
కిందపడిపోయిన నన్ను మల్కాజ్ గిరి ప్రజలు ఆశ్వీరధించారు..
ఎంపీ కావడం వల్ల
పీసీసీ అధ్యక్షుడిగా సోనియా గాంధీ నియమించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి, నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం..
ఒక్క పైసా ఆశించకుండా ఆడబిడ్డలు నాకు ఓటు వేశారు…
గత ప్రభుత్వ సహకారం లేకపోవడంలో మల్కాజ్ గిరి పార్లమెంటులో అభివృద్ధి సరిగా చేయలేకపోయాను..
కాలం గిర్రున తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టాను..
హైదరాబాద్ లో నాలుగు రకాల పరిపాలన జరుగుతుండేది..
శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి సరిగా జరగలేదు..
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయల కల్పన కోసం విజన్ డాక్యూమెంట్ ను తీసుకువచ్చాం..
తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంటును తీసుకువచ్చి క్రమపద్దతిలో అభివృద్ధి చేయబోతున్నాం..
అవుటర్ రింగ్ రోడ్డు లోపల కోటి ముప్పై లక్షమంది నివసిస్తున్నారు..
మౌలిక సదుపాయలు , పరిపాలన సమన్వయం , మూసీ ప్రక్షాళన వంటి జరగాలంటే ప్రక్షాళన అవసరం అని భావించాం..
క్యూర్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం..
రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని కొందరు అంటున్నారు..
ఎన్నికల కోసం కాదు పరిపాలన సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం..
అంతర్జాతీయ ప్రమాణాలతో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం..
పరిపాలనను వికేంద్రీకరించాం..
పోలీస్ ,మున్సిపల్ శాఖ పరిధి ఒకేలా ఉండేలా చేశాం..
1600 కోట్ల పనులకు ఈ రోజు శంకుస్థాపనలు చేసుకున్నాం..
రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం కోసం ఎన్ని నిధులైనా ఇచ్చే బాధ్యత నాది..
రోడ్లు, చెరువుల సుందరీకరణ , మెట్రో విస్తరణ ..ఏం కావాలన్న నేను చేస్తాను
ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుదాం.. అభివృద్ధి చేసుకుందాం.. సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను
బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.. నిజంగా రాజకీయం చేస్తే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ కు బండారు రాజిరెడ్డి పేరు పెట్టేవాన్ని కాదు..
బండారు రాజిరెడ్డి ఉప్పల్ ప్రాంతానికి 40 యేళ్లు సేవలు చేశారు..
గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రెంట్ , ఢిల్లీలో యుమునా రివర్ ఫ్రంట్ అభివృద్ది చేశారు.
మేం మూసీ నది ప్రక్షాళన చేయోద్దా..?
గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలో మీటర్ల వరకు మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి,పర్యాటక ప్రాంతం గా మారుతుంది.
మూసీ మురికి కారణంగా ఇక్కడ భూముల రేట్లు పెరగడం లేదు..
నల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఆడబిడ్డలు కడుపుకోత కు గురౌతారని అక్కడి వాళ్లు బయటకు పంపుతున్నారు..
మూసీ ప్రక్షాళన చేయమని నల్గొండ ప్రజలు నన్ను పిలిస్తే పాదయాత్ర చేశాను..
మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారు..
కేంద్ర మంత్రి గా ఉన్న వ్యక్తి ఈ రోజు మూసీ కి అడ్డంపడుతున్నాడు..
హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9 వ స్థానానికి పడిపోయింది..
మెట్రో ను విస్తరించడానికి అడ్డుపడుతున్నారు..
మెట్రో విస్తరించాలన్న అవసరం ఉందా లేదా అన్నది ఆలోచించాలి..
అన్ని అనుమతులు వచ్చాక కేంద్ర మంత్రి గా పనిచేస్తున్న ఆయన కాళ్లలో కట్టెలు పెట్టి ఆపుతున్నాడు..
రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ప్రపంచంతోనే పోటీ పడే అవకాశం ఉంటుంది..
రెండున్నర యేళ్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లా, మోదీని కలిశాను..
సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..?
హైదరాబాద్ ప్రజలు కిషన్ రెడ్డి కి ఓట్లు వేయలేదా..?
మెట్రో కు అనుమతులు తెచ్చే బాధ్యత, మూసీకి నిధులు తీసుకువచ్చే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..
తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది.. మిగిలిన 25 లక్షలు ఎవరు కొనాలి..
కేంద్రం తో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా..
తెలంగాణ ప్రజలతో గోకున్నోడు బాగుపడినట్లు లేదు కిషన్ రెడ్డి..
15 వ తేదీ తర్వాత బరాబర్ కిషన్ రెడ్డి సంగతి చెపుతాం..
బీజేపీలో ఉండి చీకట్లో ఇవతలి వాళ్లతో కిషన్ రెడ్డి సహకారం తీసుకుంటున్నాడు..
కిషన్ రెడ్డి ఉపన్యాసాలు ఆపాలి..
అభివృద్ధి కోసం కలిసి వస్తానని అంటే కిషన్ రెడ్డి నన్ను కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకుపోవడం లేదు..
తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం పైన చర్చించడానికి ముందుకు రాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకుని తిరుగుతున్నడు..దీనికి కారణంగా కిషన్ రెడ్డి
అన్నింటికి సహకరిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతం..
గతంలో కిషన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తే ప్రజలు ఓడించారు..
ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దాం.
కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందాం..
ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా పని చేస్తా.. అది నా బాధ్యత…
రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం..
నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ టూ లో మూసీ ప్రక్షాళన చేస్తాం..
వంద రోజుల్లో కార్యాచరణ మొదలౌతుంది..


