శ్రీ మహంకాళి దేవస్థానం చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక
జర్నలిస్టులకు శాలువాలతో సన్మానం, బోనాల శుభాకాంక్షలు
ఉప్పల్:
బోనాల పండుగను పురస్కరించుకుని ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఉప్పల్ శ్రీ మహంకాళి దేవస్థానం చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు శాలువాలు కప్పి ఆత్మీయంగా సత్కరించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజహితం కోసం, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి నడుమ వారధిగా నిలుస్తూ జర్నలిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్, ప్రధాన కార్యదర్శి ఆనంద నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఇడపాక సురేష్, బోడ ప్రవీణ్, కదుకూరి ప్రశాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు యాకూబ్ పాషా, నెమ్మది వెంకన్న, దేవతో పాటు పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నివేదిక: సందీప్, పున్నమి విలేకరి, మేడ్చల్ జిల్లా.

ఉప్పల్‌లో జర్నలిస్టులకు ఘన సత్కారం
శ్రీ మహంకాళి దేవస్థానం చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక జర్నలిస్టులకు శాలువాలతో సన్మానం, బోనాల శుభాకాంక్షలు ఉప్పల్: బోనాల పండుగను పురస్కరించుకుని ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఉప్పల్ శ్రీ మహంకాళి దేవస్థానం చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు శాలువాలు కప్పి ఆత్మీయంగా సత్కరించి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజహితం కోసం, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి నడుమ వారధిగా నిలుస్తూ జర్నలిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వడ్డేపల్లి కిషోర్, ప్రధాన కార్యదర్శి ఆనంద నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఇడపాక సురేష్, బోడ ప్రవీణ్, కదుకూరి ప్రశాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు యాకూబ్ పాషా, నెమ్మది వెంకన్న, దేవతో పాటు పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నివేదిక: సందీప్, పున్నమి విలేకరి, మేడ్చల్ జిల్లా.

