ఉదయగిరిలో 24న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
ఉదయగిరి, సెప్టెంబర్ 20: ఉదయగిరి టీటీడీ కల్యాణ మండపంలో సెప్టెంబర్ 24న గురువారం ఉదయం 9 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ కొండా రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ వివిధ విభాగాల్లో పదవులు పొందిన నాయకులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ కన్వీనర్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, అనుబంధ విభాగాల నాయకులు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఉదయగిరిలో 24న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
ఉదయగిరిలో 24న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఉదయగిరి, సెప్టెంబర్ 20: ఉదయగిరి టీటీడీ కల్యాణ మండపంలో సెప్టెంబర్ 24న గురువారం ఉదయం 9 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ కొండా రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ వివిధ విభాగాల్లో పదవులు పొందిన నాయకులకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ కన్వీనర్లు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, అనుబంధ విభాగాల నాయకులు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

