Sunday, 13 September 2026
  • Home  
  • ఉదయగిరిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Date. 02.08.2026 దుత్తలూరు (పున్నమి ప్రతినిధి ) ఉదయగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉదయగిరిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ జెండాలు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు వివిధ మండలాల జనసేన మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా ఉదయగిరిలో జనసేన శ్రేణుల సందడి నెలకొంది. Uploaded Video:

Date. 02.08.2026
దుత్తలూరు (పున్నమి ప్రతినిధి )
ఉదయగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉదయగిరిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ జెండాలు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు వివిధ మండలాల జనసేన మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా ఉదయగిరిలో జనసేన శ్రేణుల సందడి నెలకొంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.