ఉదయగిరికి 34 బీఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు.. కేంద్ర మంత్రి పెమ్మసానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు
కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సిగ్నల్ సమస్యల పరిష్కారానికి 34 బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లను మంజూరు చేసినందుకు మంత్రి పెమ్మసాని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఒక్కో టవర్‌కు రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.34 కోట్ల వ్యయంతో ఈ టవర్లు ఏర్పాటు కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్, హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు మెరుగుపడి విద్య, ఉపాధి, వ్యవసాయ సమాచారం, డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఉదయగిరికి 34 బీఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు.. కేంద్ర మంత్రి పెమ్మసానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు
ఉదయగిరికి 34 బీఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు.. కేంద్ర మంత్రి పెమ్మసానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సిగ్నల్ సమస్యల పరిష్కారానికి 34 బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లను మంజూరు చేసినందుకు మంత్రి పెమ్మసాని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఒక్కో టవర్‌కు రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.34 కోట్ల వ్యయంతో ఈ టవర్లు ఏర్పాటు కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్, హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు మెరుగుపడి విద్య, ఉపాధి, వ్యవసాయ సమాచారం, డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

