ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వర్షం నుంచి రక్షణ కోసం వంతెన కింద నిలిచిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనపై జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది.
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అవినీతి కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.


