Monday, 21 September 2026
  • Home  
  • ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన డాక్టర్ జయగోపాల్‌ కు ఘన సన్మానం
- తిరుపతి

ఉత్తమ వైద్యుడిగా అవార్డు పొందిన డాక్టర్ జయగోపాల్‌ కు ఘన సన్మానం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 18, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ ఆర్థోపెడిక్ (ఎముకల వ్యాధుల) నిపుణులు డాక్టర్ జయగోపాల్ దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ వైద్యుడిగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. వైద్య రంగంలో ఆయన అందిస్తున్న నిరంతర, అమూల్యమైన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ జయగోపాల్ ను ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు డాక్టర్ జయగోపాల్ ఎంతో మానవత్వంతో, నిష్ఠతో వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయనకు ఈ అవార్డు రావడం శ్రీకాళహస్తి ప్రాంతానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ జయగోపాల్ కు శాలువాలు కప్పి, పండ్ల బుట్టలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ ఆత్మీయ అభినందనల సేవా కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు ప్రముఖులు చక్రాల మహేష్, సంపత్ నాయుడు, గురుస్వామి, అబ్దుల్ హమీద్, పసల కమల, కేశవ తదితర ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుడిని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.