Thursday, 2 July 2026
  • Home  
  • ఉక్కు శంకుస్థాపనకే పరిమితం చేయకుండా పూర్తి అయ్యే విధంగా చూడాలి – సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ డిమాండ్.
- కడప

ఉక్కు శంకుస్థాపనకే పరిమితం చేయకుండా పూర్తి అయ్యే విధంగా చూడాలి – సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ డిమాండ్.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత చిరకాల వాంఛ అయిన కడప ఉక్కు ను కేవలం శంకుస్థాపనలకే పరిమితం చేయకుండా పరిశ్రమ పూర్తి అయ్యే విధముగా చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ బుధవారం నాడు బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ… విభజన చట్టంలోని హామీ కడప ఉక్కు పరిశ్రమ అన్నారు. ఏళ్ల తరబడి కడప ఉక్కు పరిశ్రమ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా అని ఇక్కడి యువత,ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు అన్నారు.అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి,వచ్చిన ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేసి వెళ్తున్నారే తప్ప ఉక్కు పరిశ్రమ అడుగు ముందుకు పడటం లేదు అన్నారు.కానీ ఈనెల 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ కు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని మంచిదేనని దీనిని CPM గా స్వాగతిస్తున్నామని కానీ మళ్ళీ పనులు ముందుకు సాగకపోతే ఉపయోగం లేదన్నారు.గతంలో ఇదే చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు దగ్గర ఎం.కంబాలదిన్నె వద్ద ఒక పైలాన్ ఆవిష్కరణ చేసి వెళ్ళాడని తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఇదే ఉక్కు కు శంకుస్థాపనకు వస్తున్నారని గుర్తు చేశారు.అధికార ప్రతిపక్ష పార్టీలు కడప ఉక్కు కు మేమంటే మేము శంకుస్థాపన చేశామని పోటీ పడి మరీ కార్యక్రమాలు చేస్తున్నారని మంచిదే నని ఎవరు తెచ్చిన ఈ ప్రాంతం,ఇక్కడి యువతకు ఉద్యోగ,ఉపాధి లభించి ఎంతో మేలు జరుగుతుందని కానీ ఇదే అధికార,ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు లో కేంద్రాన్ని నిలదీసి ఎందుకు మేమంటే మేము అని నిధులు రాబట్టలేదని ప్రశ్నించారు.కడప ఉక్కు విభజన హక్కు అన్నారు.ప్రభుత్వాలు మరీనా ఉక్కు పనులు ఆగకుండా చర్యలు చేపట్టాలని,త్వరగా పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత చిరకాల వాంఛ అయిన కడప ఉక్కు ను కేవలం శంకుస్థాపనలకే పరిమితం చేయకుండా పరిశ్రమ పూర్తి అయ్యే విధముగా చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ బుధవారం నాడు బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని సుందరయ్య భవనంలో ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ…
విభజన చట్టంలోని హామీ కడప ఉక్కు పరిశ్రమ అన్నారు. ఏళ్ల తరబడి కడప ఉక్కు పరిశ్రమ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా అని ఇక్కడి యువత,ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు అన్నారు.అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి,వచ్చిన ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేసి వెళ్తున్నారే తప్ప ఉక్కు పరిశ్రమ అడుగు ముందుకు పడటం లేదు అన్నారు.కానీ ఈనెల 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కు పరిశ్రమ కు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని మంచిదేనని దీనిని CPM గా స్వాగతిస్తున్నామని కానీ మళ్ళీ పనులు ముందుకు సాగకపోతే ఉపయోగం లేదన్నారు.గతంలో ఇదే చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు దగ్గర ఎం.కంబాలదిన్నె వద్ద ఒక పైలాన్ ఆవిష్కరణ చేసి వెళ్ళాడని తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఇదే ఉక్కు కు శంకుస్థాపనకు వస్తున్నారని గుర్తు చేశారు.అధికార ప్రతిపక్ష పార్టీలు కడప ఉక్కు కు మేమంటే మేము శంకుస్థాపన చేశామని పోటీ పడి మరీ కార్యక్రమాలు చేస్తున్నారని మంచిదే నని ఎవరు తెచ్చిన ఈ ప్రాంతం,ఇక్కడి యువతకు ఉద్యోగ,ఉపాధి లభించి ఎంతో మేలు జరుగుతుందని కానీ ఇదే అధికార,ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు లో కేంద్రాన్ని నిలదీసి ఎందుకు మేమంటే మేము అని నిధులు రాబట్టలేదని ప్రశ్నించారు.కడప ఉక్కు విభజన హక్కు అన్నారు.ప్రభుత్వాలు మరీనా ఉక్కు పనులు ఆగకుండా చర్యలు చేపట్టాలని,త్వరగా పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.