Wednesday, 16 September 2026
  • Home  
  • *ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా* } {ఆరూరు } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిట్టమూరు మండలం,*}
- తిరుపతి

*ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా* } {ఆరూరు } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిట్టమూరు మండలం,*}

*ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిట్టమూరు మండలం,* ఆరూరు: తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు అంకితభావంతో కృషి చేసిన దివంగత మాజీ మండల అధ్యక్షుడు ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతిని ఆరూరు గ్రామంలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు మాట్లాడుతూ.. ఉక్కు జనార్ధన్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి మండల అధ్యక్షుడి స్థాయికి చేరుకున్న ఆయన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశారని తెలిపారు. ఆరూరు ప్రాంతంలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధికి కూడా జనార్ధన్ విశేషంగా కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని భక్తుల సౌకర్యాల కోసం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు గడిచినా ఉక్కు జనార్ధన్ జ్ఞాపకాలు తమ హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోయాయని అభిమానులు తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గం, పార్టీ పట్ల ఉన్న అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ఉక్కు జనార్ధన్‌కు ఘన నివాళులర్పించారు.

*ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతి ఘనంగా*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 26 చిట్టమూరు మండలం,*

ఆరూరు: తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు అంకితభావంతో కృషి చేసిన దివంగత మాజీ మండల అధ్యక్షుడు ఉక్కు జనార్ధన్ 9వ వర్ధంతిని ఆరూరు గ్రామంలో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు మాట్లాడుతూ.. ఉక్కు జనార్ధన్ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి మండల అధ్యక్షుడి స్థాయికి చేరుకున్న ఆయన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశారని తెలిపారు.
ఆరూరు ప్రాంతంలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం అభివృద్ధికి కూడా జనార్ధన్ విశేషంగా కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని భక్తుల సౌకర్యాల కోసం కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తొమ్మిదేళ్లు గడిచినా ఉక్కు జనార్ధన్ జ్ఞాపకాలు తమ హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోయాయని అభిమానులు తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గం, పార్టీ పట్ల ఉన్న అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని ఉక్కు జనార్ధన్‌కు ఘన నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.