ఉండి నియోజకవర్గం: కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు ఆధ్వర్యంలో “విజయోత్సవ సభ” వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రఘురామకృష్ణ రాజు గారు గత రెండు సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనలో కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్ర ప్రగతి మరియు ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయమని, కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలనతో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సభలో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు Mantena Ramaraju, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్, జనసేన PAC సభ్యుడు వి. సూర్యనారాయణ రాజు (కనకరాజు సూరి), ఉండి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి జుత్తిగ నాగరాజు, పశ్చిమగోదావరి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, బీజేపీ నాయకులు గాదిరాజు వెంకటేశ్వర రాజు మరియు BJPPAVANKUMARB సహా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/06/haldhar-nag-padma-shri-inspiring-story.html


