Wednesday, 1 July 2026
  • Home  
  • ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన.. సీసీ కెమెరాల నిఘా పక్కా!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన.. సీసీ కెమెరాల నిఘా పక్కా!

ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం క్షుణ్ణంగా పరిశీలించారు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన మూడు గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.గోదాములలో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సీల్స్, స్ట్రాంగ్ రూమ్ భద్రతతో పాటు గోదాము అంతర్గత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ అమలు తీరుపై రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె విజయ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రసూల్, శ్రీనివాస్, పి కోటేశ్వర్ రెడ్డి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం క్షుణ్ణంగా పరిశీలించారు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన మూడు గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.గోదాములలో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సీల్స్, స్ట్రాంగ్ రూమ్ భద్రతతో పాటు గోదాము అంతర్గత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ అమలు తీరుపై రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె విజయ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రసూల్, శ్రీనివాస్, పి కోటేశ్వర్ రెడ్డి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.