అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడిలో బుధవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి పశువుల పాక కూలిపోయింది. ఈ ఘటనలో రెండు పాడి గేదెలు, ఒక దూడ మృతి చెందగా, మరో రెండు పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. పాడి పశువులే జీవనాధారమని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టీడీపీ నేత దాసరి వీర వెంకట సత్యనారాయణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈదురు గాలులకు పశువుల పాక కూలి.. రెండు గేదెలు, దూడ మృతి