తేది: 03.05.2026న కావలి పట్టణంలోని ఇస్లాంపేట ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను గుర్తించి వారి వివరాలు నమోదు చేశారు. అలాగే యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతి కాపాడటానికి ఇటువంటి తనిఖీలు తరచుగా కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇస్లాంపేటలో పోలీసుల కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ – 28 వాహనాలు స్వాధీనం