ఖమ్మం: వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించి, ఇంకా పనులు ప్రారంభం కాని ఇళ్ల వివరాలు, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని, సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రతిరోజూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.



