ఆఫ్రికా దేశాల్లో ఈబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో జరగాల్సిన నాల్గో ఇండియా-ఆఫ్రికా ఫోరం సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ సమావేశం మే 28 నుంచి 31 వరకు నిర్వహించాల్సి ఉండగా, ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఆఫ్రికన్ యూనియన్‌తో చర్చల అనంతరం కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఈబోలా ప్రభావిత దేశాలకు భారత్ అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్రం పేర్కొంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల సదస్సు వాయిదా పడిన విషయం గుర్తుచేశారు. ఈ నిర్ణయం భారత్-ఆఫ్రికా సంబంధాలపై తాత్కాలిక ప్రభావం చూపనున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు

ఇండియా-ఆఫ్రికా సదస్సు వాయిదా