వార్త ముఖ్యాంశాలు
- "ఆ అంబర వీధి యందు"...!
- మంజుల మారాళ గళము నడయాడుతుండగా..!
- " ఆ అంబర వీధి యందు" నిస్వార్థ తలంపుల ప్రవాహంలో, నా శాంతి మరాళముగా, మకరంద భావనామృత ధారలు కురిపించగా..!
“ఆ అంబర వీధి యందు”…!
మంజుల మారాళ గళము నడయాడుతుండగా..!
” ఆ అంబర వీధి యందు” నిస్వార్థ తలంపుల ప్రవాహంలో,
నా శాంతి మరాళముగా, మకరంద భావనామృత ధారలు కురిపించగా..!
ఆనాటి సత్కవీంద్రుల కలములోని మకరంద సారం ధారగా..!
ఆ జాబిల్లి వెలుగులో మెరవగా..!
” ఆ అంబర వీధిలో” మూగబోయిన గాన గంధర్వుల గొంతులోని
మాధుర్యపు శృతులు శోభాయమానంగా వెలుగొందగా..!
“ఆకాశవీధిలో” ఆ సరస్వతీ దేవి పాదముల యొక్క
అడుగుల శబ్దముల శోభతో వెలుగొందగా..!
నా మనస్సు ఆనంద డోలికలలో మైమరచి ఊగగా…!
–కవి, రచయిత -కె. రెడ్డప్ప యాదవ్