Wednesday, 29 July 2026
  • Home  
  • ఆలయ పరిసరాల్లో చలివేంద్రాల పందిళ్లను తొలగించాలి-బీజేపీ నేత రమేష్ బాబు
- తిరుపతి

ఆలయ పరిసరాల్లో చలివేంద్రాల పందిళ్లను తొలగించాలి-బీజేపీ నేత రమేష్ బాబు

శ్రీ కాళహస్తి, జులై 28, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వేసవికాలంలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ పరిసర ప్రాంతాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాల పందిళ్లను వెంటనే తొలగించాలని శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు ఆలయ అధికారులను కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఆలయ నాలుగవ గేటు పీఆర్వో ఆఫీసు ముందు, మూడవ గేటు ఎదురుగా ఉన్న రాఘవేంద్ర స్వామి ఆలయ సమీపంలో, కృష్ణారెడ్డి మండపం ముందు ఈ చలివేంద్రాలను పందిళ్లతో సహా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం వేసవికాలం పూర్తయిపోయినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో నిర్మించిన కర్రల పందిళ్లను తొలగించకపోవడం వల్ల భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన విమర్శించారు. నిరంతరాయంగా భక్తుల రద్దీతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ మూడు కీలక ప్రాంతాలలో ఆ పందిళ్లు అడ్డంగా మారడం వల్ల కాలినడకన వెళ్లే భక్తులకు, వాహనాల రాకపోకలకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి ఆలయ అధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో ఉన్న చలివేంద్రాల పందిళ్లను తక్షణమే తొలగించి, భక్తులకు మరియు స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని గరికపాటి రమేష్ బాబు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.