Wednesday, 22 April 2026
  • Home  
  • ఆరోగ్యవంతమైన మనస్సుకు క్రీడలే కీలకం-చంద్రప్ప
- తిరుపతి

ఆరోగ్యవంతమైన మనస్సుకు క్రీడలే కీలకం-చంద్రప్ప

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి ఆర్‌పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రగతి పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు, మాజీ ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ అధికారి, వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. చంద్రప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర స్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేసి ఆరోగ్యవంతమైన మనస్సుకు క్రీడలే కీలకమనీ విద్యార్థులను చంద్రప్ప అభినందించారు. అలాగే సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన అంతర్జాతీయ క్రీడాకారుల విజయగాథలను వివరించి విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల క్రీడా అభివృద్ధికి ప్రోత్సాహంగా సుమారు రూ. 12 వేల విలువైన క్రీడా పరికరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్యకు అందజేశారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని సూచించారు. క్రీడా ఉపాధ్యాయులు వెంకటముని, ఇందిరమ్మల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.