Wednesday, 16 September 2026
  • Home  
  • ఆరేళ్ల ప్రణయ్ తేజ్ మృతి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి రోనంకి U M ఉమామహేశ్వరరావు
- విశాఖపట్నం

ఆరేళ్ల ప్రణయ్ తేజ్ మృతి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి రోనంకి U M ఉమామహేశ్వరరావు

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి,) ఆగస్టు 21: :విశాఖలోని లిటిల్‌ గార్డెన్‌ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌ కొట్టడంతో ఆరేళ్ల ప్రణయ్‌ తేజ్‌ మృతి చెందడం అత్యంత విషాదకరమని ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు రోనంకి UM ఉమామహేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన బాధ్యులపై, సంబంధిత స్కూల్‌ యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రులకు కలిగిన ఈ తీరని లోటును ఎవరూ పూడ్చలేరని, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులపై ఎలాంటి హింసకు తావులేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రణయ్‌ తేజ్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.