Saturday, 12 September 2026
  • Home  
  • ఆపదలో ఉన్నవారికి అండగా.. తోడేటి రాజేష్ స్వచ్ఛంద రక్తదానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపదలో ఉన్నవారికి అండగా.. తోడేటి రాజేష్ స్వచ్ఛంద రక్తదానం

ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): మురగళ్ల గ్రామానికి చెందిన యువకుడు తోడేటి రాజేష్ మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రక్తదానం చేసిన ఆయన, ఆపదలో ఉన్న వారికి తన రక్తం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ, అత్యవసర సమయంలో ఎవరికైనా తన రక్తం ఉపయోగపడాలనే మంచి సంకల్పంతో సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. యువతలో రక్తదానంపై అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానంలో భాగస్వాములు కావాలని రాజేష్ పిలుపునిచ్చారు. ఆయన చేసిన సేవను పలువురు అభినందించారు.

ఆత్మకూరు, సెప్టెంబర్ 12 (పున్నమి ప్రతినిధి): మురగళ్ల గ్రామానికి చెందిన యువకుడు తోడేటి రాజేష్ మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రక్తదానం చేసిన ఆయన, ఆపదలో ఉన్న వారికి తన రక్తం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ, అత్యవసర సమయంలో ఎవరికైనా తన రక్తం ఉపయోగపడాలనే మంచి సంకల్పంతో సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు రాజేష్ తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

యువతలో రక్తదానంపై అవగాహన పెరగాలని, ఆరోగ్యవంతులైన యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానంలో భాగస్వాములు కావాలని రాజేష్ పిలుపునిచ్చారు. ఆయన చేసిన సేవను పలువురు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.