ఆత్మకూరు మండల ప్రజలకు ముఖ్య గమనిక
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలకు అవకాశం
ఆత్మకూరు మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలు–2026కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎంపీడీవో రఫీ ఖాన్ తెలిపారు. జాబితాల్లో కులాల గుర్తింపుపై అభ్యంతరాలు ఉన్నవారు ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు సంబంధిత పంచాయతీ అభివృద్ధి అధికారులకు లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. అందిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించి, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 7వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించనున్నట్లు ఎంపీడీవో వెల్లడించారు. ప్రజలు జాబితాలను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే గడువులోగా తెలియజేయాలని కోరారు.


