ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరులోని సుప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథస్వామివారి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో సమకూర్చిన నిధులతో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు.ఈ నూతన కళ్యాణ మండపాన్ని ఆగస్టు 16, 2026 ఆదివారం ఉదయం 10:30 గంటలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.దేవస్థానానికి వచ్చే భక్తులకు, ఆలయంలో నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నూతన కళ్యాణ మండపం ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి ప్రత్యేక చొరవతో నిధులు సమకూర్చి మండప నిర్మాణం పూర్తి చేయడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

ఆత్మకూరులో రేపు నూతన కళ్యాణ మండపం ప్రారంభం………. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం