Sunday, 2 August 2026
  • Home  
  • ఆడపిల్లల అక్రమ రవాణాపై అవగాహన కలిగి ఉండాలి-న్యాయ విజ్ఞాన సదస్సులో పిలుపు
- తిరుపతి

ఆడపిల్లల అక్రమ రవాణాపై అవగాహన కలిగి ఉండాలి-న్యాయ విజ్ఞాన సదస్సులో పిలుపు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 01, (పున్నమి న్యూస్): జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో (హాస్టల్) మానవ అక్రమ రవాణా, బాలికల రక్షణపై శనివారం న్యాయ విజ్ఞాన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ న్యాయవాది గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ.. బాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, బయట వ్యక్తులు పరిచయం లేని వస్తువులు లేదా తినుబండారాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని సూచించారు. విద్యార్థినులందరూ ఒంటరిగా కాకుండా గ్రూపులుగా (కలిసికట్టుగా) పాఠశాలలకు వెళ్లి రావాలని స్పష్టం చేశారు. అనంతరం మరో న్యాయవాది గుమ్మల్ల రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు, ఆడపిల్లల అక్రమ రవాణా (ఉమెన్ ట్రాఫికింగ్) ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిని అడ్డుకోవడానికి చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలికలకు నిత్య జీవితంలో ఎలాంటి వేధింపులు లేదా రక్షణ సమస్యలు ఎదురైనా తక్షణమే ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఈ నెంబర్ ద్వారా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించి, సంబంధిత అధికారుల సహాయంతో సమస్యలను వేగంగా పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ సదస్సులో వసతి గృహ వార్డెన్, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని చట్టపరమైన రక్షణ మార్గాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.