Thursday, 30 July 2026
  • Home  
  • ఆగస్టు 1న శ్రీకాళహస్తిలో దివ్య సహస్ర ఘటాభిషేక మహోత్సవం-చైర్మన్ కొట్టే సాయి
- తిరుపతి

ఆగస్టు 1న శ్రీకాళహస్తిలో దివ్య సహస్ర ఘటాభిషేక మహోత్సవం-చైర్మన్ కొట్టే సాయి

శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి టెంపుల్ న్యూస్): సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలనే సదుద్దేశంతో ఆగస్టు ఒకటో తేదీన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో దివ్య సహస్ర ఘటాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి వారికి పండితుల దివ్య వేదోచ్చరణలు, మంత్రోచ్ఛరణల మధ్య ఈ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. లోకక్షేమం, ప్రజా సౌఖ్యం, అందరి సుఖసంతోషాల కోసం కనుల పండుగగా జరిగే ఈ పవిత్ర మహోత్సవంలో నియోజకవర్గ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ మృత్యుంజయ స్వామి వారి దివ్య కృపాకటాక్షాలను పొందవలసిందిగా ఆయన మనస్ఫూర్తిగా కోరారు. ఉత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు, ప్రత్యేక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.