Friday, 11 July 2025
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” — ప్రజారోగ్య వేదిక డిమాండ్. Dr MVR
- Featured

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” — ప్రజారోగ్య వేదిక డిమాండ్. Dr MVR

“ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి” — ప్రజారోగ్య వేదిక డిమాండ్ ———————————————- భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73యేళ్ళు నిండుతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటింది. కానీ రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యాన్ని నిషేధించాలి. మన రాష్ట్రంలోని 5 కోట్లు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలో “సంపూర్ణ మద్య నిషేధం” అమలు చేయాలి. కానీ ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకుని ప్రోత్సహిస్తున్నాయి. మద్య నిషేధం అంశాన్ని అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాయి. 1991- 1992లో రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సారా వ్యతిరేక ఉద్యమ సెగతో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1993 అక్టోబర్ 1 న “సారా నిషేధం” ప్రకటించింది. కానీ ఆ నిషేధాన్ని అమలు చేయడంలో మాత్రం ఘోరం గా విఫలమైంది. 1994 లో అధికారంలోకి వచ్చిన ఎన్.టి.రామారావు (తెలుగు దేశం పార్టీ) ప్రభుత్వం “సంపూర్ణ మద్య నిషేధం” అమలులోకి తెచ్చింది. కానీ 1996లో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందనే సాకు చెప్పి 1997లో మద్య నిషేధం ఎత్తివేశారు. ఇలా గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పరిపాలన సాగించాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) “నవ రత్నాలు” అనే 9 రంగాలను పరిపాలనాంశాలుగా నిర్ణయించింది. అందులో దశలవారీగా “సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడం” అనేది కూడా ఒక అంశం. పైగా 2017 జూలైలో అమరావతి లో జరిగిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని తీర్మానించారు. అందులో భాగంగానే మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి రూపొందించిన “నూతన మద్యం పాలసీ”ని అమలులోకి తేవడం ఒక ముందడుగు. * రాష్ట్రంలోని మొత్తం లైసెన్స్ గల 4380 మద్యం షాపులను సుమారు 3000కు తగ్గించడం. * గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులను తొలగించడం. * ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడం. అందుకోసం ఉద్యోగులను నియమించుకోవడం. * గతంలో మద్యం అమ్మకాల సమయం ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఉదయం 11గం.ల నుండి రాత్రి 7 గం.ల వరకు మాత్రమే అమ్మకాలు నిర్వహించడం లాంటి చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు. కానీ నేడు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్య వినాశకారిగా పరిగణించడం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ. 2.5 లక్షల కోట్లు. కాగా అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. కానీ మద్యపానం ద్వారా సంభవించిన జబ్బులు లివర్ క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబేసిటీ, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను మరియు ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం దాదాపు అక్షరాలా రూ. 40,000/ కోట్లంటే అతిశయోక్తి కాదు. అదే సందర్భంలో రాష్ట్రంలోని మొత్తం మరణాలలో 25% వరకు మద్యపానం సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే మరణాలే ఉంటున్నాయి. రాష్ట్రంలోని 40%-60% కుటుంబాలు మద్యపానం వల్ల చితికి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను , పట్టణ ప్రాంతాల్లోను మద్యం మత్తులో మాటా మాటా పెరిగి పెద్ద గొడవలుగా మారి దాడులు ప్రతిదాడులు చేసుకుంటూ మృత్యువు పాలవుతున్నారు. వైవాహిక జీవితంలో పురుషులు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతున్నారు. సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భావి భారత పౌరులు 12ఏళ్ళ వయసు నుంచే మద్యపానానికి బానిసలై పోతూ నేరప్రవృత్తికి దాసోహం అయిపోతున్నారు. మొత్తం యాక్సిడెంట్ కేసుల్లో 75% డ్రంకన్ డ్రైవ్ కేసులే. యువత పెడధోరణులు తొక్కుతూ తల్లి తండ్రులు, అక్కాచెల్లెళ్ళు, రక్తసంబంధాలు అనే ఉచ్ఛ నీచాలు మరచిపోయి కుటుంబ, సామాజిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. దేశం ఎంతో యువశక్తిని, మేథో సంపత్తిని కోల్పోతోంది. కనుక వీటన్నింటికీ సరైన పరిష్కారం “సంపూర్ణ మద్య నిషేధం” ఒక్కటే. గాంధీ గారు ఒక సందర్భంలో మద్యపానం గురించి మాట్లాడుతూ ” దొంగతనం, వ్యభిచారం కంటే మద్యపానం అత్యంత నీచమైంది. ఒక గంటసేపు నేను భారత దేశానికి నియంతనైతే ఎలాంటి నష్ట పరిహారాలు చెల్లించకుండా దేశం లోని మొత్తం మద్యం కంపెనీలను మూసేస్తాను” అని అన్నారు. ఇప్పటికే బీహార్, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. కేరళలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గేంతవరకు మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకే అక్కడ ప్రజల ఆరోగ్య స్థాయిలు మెరుగ్గానే ఉన్నాయి.నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఎవరినైనా మద్య పానం మాన్పించడానికి 21 రోజుల సమయం సరిపోతుంది. కానీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన 40రోజుల లాక్ డౌన్ లో మద్యం అందుబాటులో లేకుండా పోయింది. అందువల్ల దాదాపుగా 70 నుంచి 90 శాతం మంది అనివార్యంగా మద్యం మానేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు మాత్రం అనుమతించింది. లాక్ డౌన్ సమయంలో మద్యం మానేసిన దాదాపు 70-90% మంది ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది! కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యపానం అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కావున ఈ లాక్ డౌన్ సమయంలో ఆహారం కోసమే ప్రయాస పడుతున్నవారు ఇప్పుడు మద్యానికి డబ్బులేక ఇళ్ళలో ఉన్న వస్తువులను, భార్య మెడలోని మంగళ సూత్రాలు కూడా అమ్మేసి తాగుడుకు ధారపోసే అవకాశం ఉంది.ఇంట్లో ఏమీ లేకపోతే ప్రక్క ఇళ్ళలోకి చొరబడి దొంగతనాలు, దోపిడీలకు ఇతర దుర్మార్గపు చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మద్యానికి దూరమై సాధారణ జీవితంలోకి మారిపోయినవారు కుటుంబాలతో కలిసి మెలసి సంతోషంగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మద్యాన్ని ఎన్ని షరతులతో ప్రవేశపెట్టినా అది కుటుంబాలలోను, గ్రామాలలోను చిచ్చు పెట్టడానికి, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకే దోహదం చేస్తోంది. కాబట్టి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వై.సి.పి. పార్టీ ప్లీనరీ సమావేశాల్లోను, ఎన్నికల మేనిఫెస్టోలోనూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 5 కోట్ల ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం మరియు రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడుకునేందుకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలులోకి తేవాలి. –డా. యం.వి.రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , టి.కామేశ్వరరావు,ప్రధానకార్యదర్శి.

“ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి”
— ప్రజారోగ్య వేదిక డిమాండ్
———————————————-
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73యేళ్ళు నిండుతున్నాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటింది. కానీ రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్యాన్ని నిషేధించాలి.

మన రాష్ట్రంలోని 5 కోట్లు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలో “సంపూర్ణ మద్య నిషేధం” అమలు చేయాలి. కానీ ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకుని ప్రోత్సహిస్తున్నాయి. మద్య నిషేధం అంశాన్ని అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాయి.
1991- 1992లో రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సారా వ్యతిరేక ఉద్యమ సెగతో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1993 అక్టోబర్ 1 న “సారా నిషేధం” ప్రకటించింది. కానీ ఆ నిషేధాన్ని అమలు చేయడంలో మాత్రం ఘోరం గా విఫలమైంది.
1994 లో అధికారంలోకి వచ్చిన ఎన్.టి.రామారావు (తెలుగు దేశం పార్టీ) ప్రభుత్వం “సంపూర్ణ మద్య నిషేధం” అమలులోకి తెచ్చింది. కానీ 1996లో అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందనే సాకు చెప్పి 1997లో మద్య నిషేధం ఎత్తివేశారు. ఇలా గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పరిపాలన సాగించాయి.
కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వై.యస్. జగన్మోహన్ రెడ్డి (వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ) “నవ రత్నాలు” అనే 9 రంగాలను పరిపాలనాంశాలుగా నిర్ణయించింది. అందులో దశలవారీగా “సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడం” అనేది కూడా ఒక అంశం.
పైగా 2017 జూలైలో అమరావతి లో జరిగిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని తీర్మానించారు.
అందులో భాగంగానే మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి రూపొందించిన “నూతన మద్యం పాలసీ”ని అమలులోకి తేవడం ఒక ముందడుగు.
* రాష్ట్రంలోని మొత్తం లైసెన్స్ గల 4380 మద్యం షాపులను సుమారు 3000కు తగ్గించడం.
* గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బెల్ట్ షాపులను తొలగించడం.
* ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడం. అందుకోసం ఉద్యోగులను నియమించుకోవడం.
* గతంలో మద్యం అమ్మకాల సమయం ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఉదయం 11గం.ల నుండి రాత్రి 7 గం.ల వరకు మాత్రమే అమ్మకాలు నిర్వహించడం లాంటి
చర్యలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందనలు.
కానీ నేడు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్య వినాశకారిగా పరిగణించడం లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ. 2.5 లక్షల కోట్లు. కాగా అందులో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17,340 కోట్లు. కానీ మద్యపానం ద్వారా సంభవించిన జబ్బులు లివర్ క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు, చర్మవ్యాధులు, ఒబేసిటీ, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు లాంటి మరెన్నో ప్రమాదకరమైన జబ్బులకు ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారాను మరియు ప్రజలు నేరుగాను ఏడాదికి చెల్లించిన మొత్తం దాదాపు అక్షరాలా రూ. 40,000/ కోట్లంటే అతిశయోక్తి కాదు. అదే సందర్భంలో రాష్ట్రంలోని మొత్తం మరణాలలో 25% వరకు మద్యపానం సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే మరణాలే ఉంటున్నాయి. రాష్ట్రంలోని 40%-60% కుటుంబాలు మద్యపానం వల్ల చితికి పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోను , పట్టణ ప్రాంతాల్లోను మద్యం మత్తులో మాటా మాటా పెరిగి పెద్ద గొడవలుగా మారి దాడులు ప్రతిదాడులు చేసుకుంటూ మృత్యువు పాలవుతున్నారు. వైవాహిక జీవితంలో పురుషులు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతున్నారు. సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. భావి భారత పౌరులు 12ఏళ్ళ వయసు నుంచే మద్యపానానికి బానిసలై పోతూ నేరప్రవృత్తికి దాసోహం అయిపోతున్నారు. మొత్తం యాక్సిడెంట్ కేసుల్లో 75% డ్రంకన్ డ్రైవ్ కేసులే. యువత పెడధోరణులు తొక్కుతూ తల్లి తండ్రులు, అక్కాచెల్లెళ్ళు, రక్తసంబంధాలు అనే ఉచ్ఛ నీచాలు మరచిపోయి కుటుంబ, సామాజిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. దేశం ఎంతో యువశక్తిని, మేథో సంపత్తిని కోల్పోతోంది. కనుక వీటన్నింటికీ సరైన పరిష్కారం “సంపూర్ణ మద్య నిషేధం” ఒక్కటే.

గాంధీ గారు ఒక సందర్భంలో మద్యపానం గురించి మాట్లాడుతూ ” దొంగతనం, వ్యభిచారం కంటే మద్యపానం అత్యంత నీచమైంది. ఒక గంటసేపు నేను భారత దేశానికి నియంతనైతే ఎలాంటి నష్ట పరిహారాలు చెల్లించకుండా దేశం లోని మొత్తం మద్యం కంపెనీలను మూసేస్తాను” అని అన్నారు.
ఇప్పటికే బీహార్, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. కేరళలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గేంతవరకు మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకే అక్కడ ప్రజల ఆరోగ్య స్థాయిలు మెరుగ్గానే ఉన్నాయి.నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
సాధారణంగా ఎవరినైనా మద్య పానం మాన్పించడానికి 21 రోజుల సమయం సరిపోతుంది. కానీ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు విధించిన 40రోజుల లాక్ డౌన్ లో మద్యం అందుబాటులో లేకుండా పోయింది. అందువల్ల దాదాపుగా 70 నుంచి 90 శాతం మంది అనివార్యంగా మద్యం మానేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తూ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు మాత్రం అనుమతించింది. లాక్ డౌన్ సమయంలో మద్యం మానేసిన దాదాపు 70-90% మంది ఇప్పుడు తిరిగి మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది! కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యపానం అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

కావున ఈ లాక్ డౌన్ సమయంలో ఆహారం కోసమే ప్రయాస పడుతున్నవారు ఇప్పుడు మద్యానికి డబ్బులేక ఇళ్ళలో ఉన్న వస్తువులను, భార్య మెడలోని మంగళ సూత్రాలు కూడా అమ్మేసి తాగుడుకు ధారపోసే అవకాశం ఉంది.ఇంట్లో ఏమీ లేకపోతే ప్రక్క ఇళ్ళలోకి చొరబడి దొంగతనాలు, దోపిడీలకు ఇతర దుర్మార్గపు చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. మద్యానికి దూరమై సాధారణ జీవితంలోకి మారిపోయినవారు కుటుంబాలతో కలిసి మెలసి సంతోషంగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మద్యాన్ని ఎన్ని షరతులతో ప్రవేశపెట్టినా అది కుటుంబాలలోను, గ్రామాలలోను చిచ్చు పెట్టడానికి, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకే దోహదం చేస్తోంది.

కాబట్టి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వై.సి.పి. పార్టీ ప్లీనరీ సమావేశాల్లోను, ఎన్నికల మేనిఫెస్టోలోనూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 5 కోట్ల ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం మరియు రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడుకునేందుకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలులోకి తేవాలి.

–డా. యం.వి.రమణయ్య, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు , టి.కామేశ్వరరావు,ప్రధానకార్యదర్శి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.