దేశంలో అక్రమ వలసలు, ఇతర కారణాల వల్ల జరుగుతున్న అస్వాభావిక జనాభా మార్పులను (Demographic Shifts) అడ్డుకునేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గతంలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటయింది.
రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావోలేకర్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. మాజీ ఐఏఎస్ దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి ఇందులో సభ్యులుగా ఉంటారు. దేశవ్యాప్తంగా మత, సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న జనాభా మార్పులను విశ్లేషించి, పరిష్కారాలు సూచించడం ఈ కమిటీ ముఖ్య విధి.


