Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అలరించిన ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్దుల విజ్ఞాన ప్రదర్శనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అలరించిన ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్దుల విజ్ఞాన ప్రదర్శనలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆక్స్ఫర్డ్ ఎక్స్పో & ఫుడ్ ఫెస్ట్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..
  • విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, వారి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని విద్యార్థుల కృషిని అభినందించి, తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆక్స్ఫర్డ్ ఎక్స్పో & ఫుడ్ ఫెస్ట్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు, వారి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని విద్యార్థుల కృషిని అభినందించి, తల్లిదండ్రుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థులు వివిధ సైన్స్ ప్రాజెక్టులు, కళాత్మక ప్రదర్శన, సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. పిల్లలు తయారు చేసిన వినూత్న ప్రాజెక్టులు, శాస్త్రీయ నమూనాలు, సామాజిక అంశాలపై రూపొందించిన ప్రదర్శనలు తల్లిదండ్రులను, సందర్శకులను ఆకట్టుకోగా పాఠశాల వారు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ లో రుచికరమైన వంటకాలను స్వీకరించి ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రదర్శనలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *