( జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
కావలి లో అభివృద్ధి పేరిట అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారని తమ ప్రభుత్వహయాంలో వచ్చిన మంజూరు లను తమవిగా చెప్పు కోవడం విడ్డూరంగా ఉందని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం నుంచి ప్రజలతో మమేకం అవుతున్న క్రమం లో ఆయన సోమవారం నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు దీనిపై దశలవారీ పోరాటం చేపట్టనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోగా. ముందుగా మహిళా నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పలువురు వక్తలు కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇది ఏమాత్రం క్షమించరానిదని అన్నారు.అనంతరం రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలను వెల్లడించి, వచ్చిన అభ్యంతరాలపై నిష్పాక్షిక విచారణ జరిపి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కావలి టౌన్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మంజూరు చేయించడం జరిగిందని … ఆ పనులకు కావాల్సిన ప్రతి ఒక్క అనుమతిని తాను ఎంతో కష్టపడి కావలి ప్రజల కోసం తీసుకురావడం జరిగిందని అందులో దాదాపుగా ముసునూరు నుంచి కావలి వరకు ఉండే రోడ్డు పక్కన కాలవల నిర్మాణం ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హ్యంలోనే జరిగినవన్నీ ఇప్పుడు కేవలం రోడ్డు మాత్రమే నిర్మిస్తూ తామేదో పూర్తిస్థాయిలో కావలి రూపురేఖలు మార్చేస్తున్నట్టు ఆ భూత కల్పనలు ప్రజలకు చేరవేస్తున్నారని… కూటమి ప్రభుత్వ నాయకుల పొంతన చూస్తుంటే చేసేది గోరంత చెప్పేది కొండంతగా ఉందని కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న తాము ఎల్లప్పుడూ వారికి అండగా నిలబడతామని ప్రభుత్వం చేసే తప్పులను నిలదీసి ప్రజల పక్షాన పోరాడుతామని అని సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి మరియు కావలి ప్రజలకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ అన్నీ మండలాల నుంచి భారీ స్థాయిలో కార్యకర్తల పాల్గొని డీఎస్సీలో అక్రమాలు చేసినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

అభివృద్ధి కి అభూత కల్పనలు ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజం
( జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) కావలి లో అభివృద్ధి పేరిట అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారని తమ ప్రభుత్వహయాంలో వచ్చిన మంజూరు లను తమవిగా చెప్పు కోవడం విడ్డూరంగా ఉందని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం నుంచి ప్రజలతో మమేకం అవుతున్న క్రమం లో ఆయన సోమవారం నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు దీనిపై దశలవారీ పోరాటం చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోగా. ముందుగా మహిళా నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పలువురు వక్తలు కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇది ఏమాత్రం క్షమించరానిదని అన్నారు.అనంతరం రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలను వెల్లడించి, వచ్చిన అభ్యంతరాలపై నిష్పాక్షిక విచారణ జరిపి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కావలి టౌన్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మంజూరు చేయించడం జరిగిందని … ఆ పనులకు కావాల్సిన ప్రతి ఒక్క అనుమతిని తాను ఎంతో కష్టపడి కావలి ప్రజల కోసం తీసుకురావడం జరిగిందని అందులో దాదాపుగా ముసునూరు నుంచి కావలి వరకు ఉండే రోడ్డు పక్కన కాలవల నిర్మాణం ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హ్యంలోనే జరిగినవన్నీ ఇప్పుడు కేవలం రోడ్డు మాత్రమే నిర్మిస్తూ తామేదో పూర్తిస్థాయిలో కావలి రూపురేఖలు మార్చేస్తున్నట్టు ఆ భూత కల్పనలు ప్రజలకు చేరవేస్తున్నారని… కూటమి ప్రభుత్వ నాయకుల పొంతన చూస్తుంటే చేసేది గోరంత చెప్పేది కొండంతగా ఉందని కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ప్రజల పక్షాన ప్రతిపక్షంలో ఉన్న తాము ఎల్లప్పుడూ వారికి అండగా నిలబడతామని ప్రభుత్వం చేసే తప్పులను నిలదీసి ప్రజల పక్షాన పోరాడుతామని అని సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి మరియు కావలి ప్రజలకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ అన్నీ మండలాల నుంచి భారీ స్థాయిలో కార్యకర్తల పాల్గొని డీఎస్సీలో అక్రమాలు చేసినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

