అభివృద్ధి అడుగులు సంక్షేమం వెలుగులుకార్యక్రమంలో జనసేన ఇంటింటి ప్రచారం
లో కిషోర్ గునుకుల,శ్రీమతి విజయలక్ష్మీ-జనసేన
నెల్లూరు నగరం 16వ అభివృద్ధి అడుగులు సంక్షేమం వెలుగులు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూరానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, వీరమహిళలతో కలిసి స్థానిక ప్రముఖులను కలుసుకుని అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెల్లూరు నగరంలో, ముఖ్యంగా 16వ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ చర్యలను వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల తరఫున పోరాడుతున్న కిషోర్ గునుకుల చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలన, మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వంలో నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ ప్రముఖులు కొట్టే రామ్మూర్తి, బీజేపీ నాయకులు ముక్కు రాధాకృష్ణ గౌడ్,మదు,శ్రీధర్ తదితరుల కుంటుంబసభ్యులను కలసి డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, శ్రీమతి జయలక్ష్మి గునుకుల, పసుపులేటి ప్రవల్లిక, మడపర్తి ప్రశాంత్ గౌడ్, కార్తీక్, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు.



