Wednesday, 29 July 2026
  • Home  
  • అన్నారు గూడెం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.
- ఖమ్మం

అన్నారు గూడెం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

తల్లాడ, జులై (పున్నమి న్యూస్) తల్లాడ మండలం అన్నారు గూడెం గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రవీణ్ అయ్యగారు మాట్లాడుతూ గురు పౌర్ణిమ గురువును స్మరించుకునే పవిత్ర దినమని, శ్రీ షిర్డీ సాయిబాబా బోధించిన సేవ, సత్య, ధర్మ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తల్లాడ, జులై
(పున్నమి న్యూస్)

తల్లాడ మండలం అన్నారు గూడెం గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రవీణ్ అయ్యగారు మాట్లాడుతూ గురు పౌర్ణిమ గురువును స్మరించుకునే పవిత్ర దినమని, శ్రీ షిర్డీ సాయిబాబా బోధించిన సేవ, సత్య, ధర్మ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.