ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 18( పున్నమి ప్రతినిధి)మనుబోలు మండల కేంద్రంలోని స్త్రీ శిశు సంక్షేమ రిసోర్స్ భవనం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. 2016లో సుమారు రూ.9 లక్షల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనం పదిేళ్లు పూర్తికాకముందే తలుపులకు చెదలు పట్టి శిధిలావస్థకు చేరుకుంది. తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల సమీపంలోనే ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. భవనం తలుపులు ఎప్పటినుంచి తెరవలేదోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చెదలు తొలగించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.. చెదలు పట్టిన స్త్రీ శిశు సంక్షేమ భవనం