Tuesday, 8 September 2026
  • Home  
  • అక్రమ హౌస్ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు -డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
- వరంగల్

అక్రమ హౌస్ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు -డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అక్రమ హౌస్ అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామిక చర్య అని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పైనే తిరగబడిన చరిత్ర మాది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు చేపట్టిన “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వరంగల్ లో తన స్వగృహంలో తనను మరియు నర్సంపేట నియోజకవర్గం లోని బిజెపి నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి, అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాయలేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ఆపలేరు. పోలీసులతో అక్రమ నిర్బంధాలు చేయించొచ్చు.. కానీ ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని మాత్రం ఆపలేరు అని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో సమస్యలు పరిష్కారం కాదు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అక్రమ హౌస్ అరెస్టులకు పాల్పడటం అప్రజాస్వామిక చర్య అని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ పైనే తిరగబడిన చరిత్ర మాది. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు చేపట్టిన “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వరంగల్ లో తన స్వగృహంలో తనను మరియు నర్సంపేట నియోజకవర్గం లోని బిజెపి నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి, అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాయలేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.
రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును రేవంత్ రెడ్డి ఆపలేరు. పోలీసులతో అక్రమ నిర్బంధాలు చేయించొచ్చు.. కానీ ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని మాత్రం ఆపలేరు అని డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.
అక్రమ అరెస్టులతో సమస్యలు పరిష్కారం కాదు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిందే అని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.