పార్వతిపురం, సెప్టెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కృషి చేయాలని ఎం.ఆర్.ఇ.ఎస్. జిల్లా అధ్యక్షులు, చర్మ కళా కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు సవరపు రామారావు కోరారు.
ఈ మేరకు దళిత సంఘ నాయకులతో కలిసి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సాధ్యమైనంత త్వరగా స్థలం కేటాయించి సామాజిక భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


