భూపాలపల్లి ఆగష్టు 07 (పున్నమి ప్రతినిధి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఎస్ఆర్ డీజీ స్కూల్, భూపాలపల్లిలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో గ్రామదేవత మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమే బోనం అని, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బోనాల పండుగ భక్తి, ఐకమత్యం, సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.
వేడుకల్లో విద్యార్థులు మహంకాళి అమ్మవారు, పోతురాజు తదితర సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకోగా, బోనం ఊరేగింపు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

అంగరంగ వైభవంగా ఎస్ ఆర్ డీజీ స్కూల్ బోనాల సంబరాలు
భూపాలపల్లి ఆగష్టు 07 (పున్నమి ప్రతినిధి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఎస్ఆర్ డీజీ స్కూల్, భూపాలపల్లిలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో గ్రామదేవత మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమే బోనం అని, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బోనాల పండుగ భక్తి, ఐకమత్యం, సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. వేడుకల్లో విద్యార్థులు మహంకాళి అమ్మవారు, పోతురాజు తదితర సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకోగా, బోనం ఊరేగింపు, జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

