నంద్యాల -: నూనెపల్లె రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు శ్యామకాలువపై ఆర్అండ్బీ వంతెన విస్తరణ, ఆసుపత్రి–ఎన్జీవోస్ కాలనీ కూడలిలో సిగ్నల్ లైట్లు ఏర్పాటు, నూనెపల్లెలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇచ్చిన హామీతో విరమించారు.
మూడో రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎంపీ శబరి ప్రజల సమస్యలను విన్నారు. రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం అంశాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కలెక్టర్ వద్ద సమావేశం నిర్వహించి సంబంధిత ఫైలును ముఖ్యమంత్రికి పంపిస్తామని, తాను మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసి బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు సాధించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యను పరిష్కరించడం తన బాధ్యత అని ఎంపీ స్పష్టం చేస్తూ దీక్ష విరమించాలని కోరారు. ఆమె హామీపై నమ్మకంతో అభివృద్ధి కమిటీ దీక్షలను విరమిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి దీక్ష చేస్తున్న వారికి స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు.
కార్యక్రమంలో నూనెపల్లె అభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు, మేధావులు, వ్యాపారులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హామీతో దీక్ష విరమణ ఎంపీ బైరెడ్డి శబరి హామీతో నూనెపల్లె దీక్షలకు ముగింపు
నంద్యాల -: నూనెపల్లె రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు శ్యామకాలువపై ఆర్అండ్బీ వంతెన విస్తరణ, ఆసుపత్రి–ఎన్జీవోస్ కాలనీ కూడలిలో సిగ్నల్ లైట్లు ఏర్పాటు, నూనెపల్లెలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇచ్చిన హామీతో విరమించారు. మూడో రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎంపీ శబరి ప్రజల సమస్యలను విన్నారు. రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నష్టపరిహారం అంశాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కలెక్టర్ వద్ద సమావేశం నిర్వహించి సంబంధిత ఫైలును ముఖ్యమంత్రికి పంపిస్తామని, తాను మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలిసి బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు సాధించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యను పరిష్కరించడం తన బాధ్యత అని ఎంపీ స్పష్టం చేస్తూ దీక్ష విరమించాలని కోరారు. ఆమె హామీపై నమ్మకంతో అభివృద్ధి కమిటీ దీక్షలను విరమిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ఎంపీ బైరెడ్డి శబరి దీక్ష చేస్తున్న వారికి స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో నూనెపల్లె అభివృద్ధి కమిటీ సభ్యులు, పెద్దలు, మేధావులు, వ్యాపారులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

