Sunday, 16 August 2026
  • Home  
  • స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ
- కడప

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ పున్నమి ప్రతినిధి – కడప కడపలోని జనసేన పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్‌చార్జి సుంకర శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. దేశభక్తి, జాతీయత, ప్రజాసేవ జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతాలని పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశభక్తి, ప్రజాసేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని సుంకర శ్రీనివాస్ అన్నారు. దేశభక్తి అంటే కేవలం జెండా వందనం చేయడం మాత్రమే కాదని, దేశ చట్టాలను గౌరవించడం, ప్రజా ఆస్తులను కాపాడటం, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడం, దేశ అభివృద్ధికి కృషి చేయడమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ

పున్నమి ప్రతినిధి – కడప

కడపలోని జనసేన పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇన్‌చార్జి సుంకర శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. దేశభక్తి, జాతీయత, ప్రజాసేవ జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతాలని పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశభక్తి, ప్రజాసేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని సుంకర శ్రీనివాస్ అన్నారు. దేశభక్తి అంటే కేవలం జెండా వందనం చేయడం మాత్రమే కాదని, దేశ చట్టాలను గౌరవించడం, ప్రజా ఆస్తులను కాపాడటం, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడం, దేశ అభివృద్ధికి కృషి చేయడమే నిజమైన దేశభక్తి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.