Friday, 11 September 2026
  • Home  
  • స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ
- ఖమ్మం

స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సంజీవరెడ్డి భవన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ పదవి ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, శాసనసభ, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవని అన్నారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత విమర్శల స్థాయికి తీసుకెళ్లకూడదని సూచించారు ర్యాలీలో అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (KKC) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, KKC ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొల్లిని నాగరాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జంగిపల్లి ప్రసాద్, ఆటో యూనియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మెరుగు వెంకట్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడగాని వేణు గౌడ్, ఎండీ గయాజ్ పాషా, త్రీ టౌన్ అధ్యక్షుడు రాజు, మెహరాజ్, చారి శ్రీను, బాలకృష్ణ, నరసింహారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సంజీవరెడ్డి భవన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ పదవి ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, శాసనసభ, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవని అన్నారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత విమర్శల స్థాయికి తీసుకెళ్లకూడదని సూచించారు
ర్యాలీలో అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ (KKC) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావం తెలిపారు.
కార్యక్రమంలో సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, KKC ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొల్లిని నాగరాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు జంగిపల్లి ప్రసాద్, ఆటో యూనియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మెరుగు వెంకట్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడగాని వేణు గౌడ్, ఎండీ గయాజ్ పాషా, త్రీ టౌన్ అధ్యక్షుడు రాజు, మెహరాజ్, చారి శ్రీను, బాలకృష్ణ, నరసింహారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.