Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: పరిశీలకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: పరిశీలకులు

వార్త ముఖ్యాంశాలు

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరగనున్న రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు ఆర్.
  • కూర్మనాథ్, వ్యయ పరిశీలకులు ధీరజ్ అధికారులకు సూచించారు.
  • సోమవారం అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరగనున్న రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు ఆర్. కూర్మనాథ్, వ్యయ పరిశీలకులు ధీరజ్ అధికారులకు సూచించారు. సోమవారం అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రత ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించి, ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. అనంతరం ముంచంగిపుట్టు మండలం కిలగడ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లైజనింగ్ అధికారి చలపతిరావు, జిల్లా సర్వే అధికారి ఈశ్వర్ దొర తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *