స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం పంచాయతీకి చెందిన వెల్నెస్ ఆర్గానిక్ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ వరదరాజు చంద్రశేఖర్ రాజుకి విశిష్ట సేవలకు గుర్తింపుగా చిత్తూరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మండల ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.ఆరోగ్యం, పరిశుభ్రత, సేంద్రీయ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేశారు. ముఖ్యంగా 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ, హానికరమైన పురుగుమందులు, రసాయనాలకు దూరంగా సహజసిద్ధమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నారు.వెల్నెస్ ఆర్గానిక్ సెంటర్ ద్వారా 100కు పైగా రకాల సేంద్రీయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను బెంగళూరు, చెన్నై, తిరుపతి, అమరావతి, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాలకు సైతం సరఫరా చేస్తున్నారు.సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ద్వారా వరదరాజు చంద్రశేఖర్ రాజు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.ఒకవైపు విజయవంతమైన పారిశ్రామికవేత్తగా, మరోవైపు సామాజిక సేవకుడిగా ఆయన చేస్తున్న కృషి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆయన సేవలకు లభించిన గౌరవంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు.ఈ ఘనమైన పురస్కారం అందుకున్న సందర్భంగా శ్రీ వరదరాజు చంద్రశేఖర్ రాజు గారికి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానికులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తూ సేంద్రీయ వ్యవసాయం, ప్రజారోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ రంగాల్లో మరింత విస్తృతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వెల్నెస్ ఆర్గానిక్ సెంటర్ వ్యవస్థాపకులు వరదరాజు చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత విస్తరించి ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు, తనకు సహకరిస్తున్న రైతులు, సిబ్బంది, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



