సీతారామపురంలో స్థానిక ఎన్నికల హడావిడి షురూ!
సీతారామపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామాల్లో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలపై ఆశావహులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల వారీగా తమ బలాబలాలను అంచనా వేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడకముందే ఆశావహుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఎవరెవరు బరిలోకి దిగుతారు? ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు? ప్రజల మొగ్గు ఎటువైపు ఉంటుంది? అనే అంశాలపై గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

సీతారామపురంలో స్థానిక ఎన్నికల హడావిడి షురూ!
సీతారామపురంలో స్థానిక ఎన్నికల హడావిడి షురూ! సీతారామపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామాల్లో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలపై ఆశావహులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల వారీగా తమ బలాబలాలను అంచనా వేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడకముందే ఆశావహుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఎవరెవరు బరిలోకి దిగుతారు? ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు? ప్రజల మొగ్గు ఎటువైపు ఉంటుంది? అనే అంశాలపై గ్రామాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

